
‘ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం’
ఖానాపూర్: నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసేదాకా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమా న్ని ఉధృతం చేస్తామని సమితి కన్వీనర్ నంది రామయ్య హెచ్చరించారు. శుక్రవారం ఖానాపూర్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పట్టణంలోని 110 ఎకరాల ప్రభుత్వ స్థలంలో పాఠశాల ఏర్పాటు చేయాలని కో రారు. ఈ స్థలంలో మిగులు భూమిపై సర్వే వివరా లు వెల్లడించకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. ఖానాపూర్‌లో ఏర్పాటు చేయాల్సిన ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ఉట్నూర్‌కు తరలించుకుపోవాలని చూడడం సరికాదన్నారు. సమి తి గౌరవాధ్యక్షుడు సాగి లక్ష్మణ్‌రావు, కో కన్వీనర్లు ఆకుల శ్రీనివాస్, కొండాడి గంగారావు, బీసీ రాజ న్న, ప్రధాన కార్యదర్శి కాశవేణి ప్రణయ్, కోశాధికా రి ఎనగందుల నారాయణ తదితరులున్నారు.