
ఇంటిగ్రేటెడ్ ఫామ్స్‌పై దృష్టి సారించాలి
దస్తురాబాద్: ఇంటిగ్రేటెడ్ ఫామ్స్‌పై ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి కూలీలు దృష్టి సారించాలని డీఆర్డీవో విజయలక్ష్మి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో నాలుగో విడత ఉపాధిహా మీ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించగా హా జరై మాట్లాడారు. భవిష్యత్‌లో ఉపాధిహామీ పథకంలో ఇంటిగ్రేటెడ్ పనులకే ప్రాధాన్యం కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతీ గ్రామంలో పాశువుల పాకలు, గోట్ షెడ్లు, వర్మీ కంపోస్టు తదితర నిర్మాణాలు చేపట్టే అవకాశముందన్నారు. అంతకుముందు 13 గ్రామపంచాయతీల పరిధిలో 2024–2025లో చేపట్టిన పనులపై ప్రజావేదికలో సమీక్ష నిర్వహించా రు. ప్రజావేదికలో ఫీల్ అసిస్టెంట్లు, టీఏలు, పంచా యతీ కార్యదర్శులు చేసిన అవకతవకల గురించి సోషల్ ఆడిటర్లు వివరించారు. సామాజిక తనిఖీలో 13గ్రామపంచాయతీల పరిధిలో రూ.96,888 నిధు లు దుర్వినియోగమైనట్లు వెల్లడించారు. ప్రతీ గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డుల నిర్వహణ సరిగా లేదని, కార్యదర్శుల తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పంచాయతీరా జ్ శాఖ అధికారులు సామాజిక తనిఖీ బృందానికి రికార్డులు అందజేయకపోవటంతో వారు చేసిన ప నులపై ఆడిట్ నిర్వహించలేదని పేర్కొన్నారు. హె చ్‌ఆర్ మేనేజర్ సుధాకర్, ఏవీవో లక్ష్మయ్య, ఆడిట్ మేనేజర్ అశోక్‌కుమార్, ఎస్‌పీఎం దత్తు, ఎస్‌ఆర్‌పీ మహేశ్, ఎంపీడీవోలు సునీత, రమేశ్, ఏపీవో రవిప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు, ఆడిట్ సిబ్బంది పాల్గొన్నారు.