నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Oct 18 2025 7:35 AM | Updated on Oct 18 2025 7:35 AM

నిర్మ

నిర్మల్‌

● భూకబ్జాలకు కేరాఫ్‌గా నిర్మల్‌ ● జిల్లా కేంద్రంలో కూల్చివేతలు ● ఆక్రమణల లెక్కలు వెల్లడయ్యేనా? ● రాజకీయ నేతల ఒత్తిళ్లు ఆపేనా? శనివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

న్యూస్‌రీల్‌

చూసొద్దాం తుర్కం చెరువు
నల్దుర్తి తుర్కం, వెంగన్న చెరువులు ఎకో టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. వీటి అందాలను తిలకించేందుకు అటవీశాఖ అవకాశం కల్పించింది.

IIలోu

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

సోన్‌: ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి గోవిజ్ఞాన ప్రతిభ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సోన్‌ జెడ్పీఎస్‌ఎస్‌కు చెందిన విద్యార్థినులు జోష్ణవి, శివరాత్రి గీతిక రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం ఆరాధన శుక్రవారం తెలిపారు. ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్న పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. వీరిని ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.

నిర్మల్‌: ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, భూకబ్జాలకు నిర్మల్‌ జిల్లా కేరాఫ్‌గా మారింది. సాక్షాత్తు జిల్లాకేంద్రంలోనే రూ.కోట్ల విలువ చేసే భూముల ను కొల్లగొడుతున్నారు. వరుస ఫిర్యాదులు, స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో జిల్లా అధికారుల్లో కొంత కదలిక కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే భూఆక్రమణ లు, అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్‌ పెడుతున్నారు. తాజాగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని మల్లన్నగుట్ట (అయ్యప్ప ఆలయం) ఎదురుగా ప్రభుత్వ భూ మిలో చేపట్టిన నిర్మాణాలను కలెక్టర్‌ ఆదేశాల మేర కు రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు కూల్చేశారు.

‘గొలుసుకట్టు’కూ భంగం కలిగించేలా..

దివ్యనగర్‌లోని 534 సర్వేనంబర్‌లో స్థానికులు బతుకమ్మకుంటగా పిలుచుకునే కుంటనూ సగానికి పైగా ఆక్రమించారు. నిర్మల్‌ చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువుల్లో భాగమైన గొల్లపేట చెరువు, డిగ్రీ కళాశాల ఎదురుగా గల ఇబ్రహీం చెరువులను కలి పేలా మధ్యలో ఈ కుంట ఉంటుంది. గొల్లపేట చె రువు అలుగు నుంచి ఈ కుంట ద్వారా ఇబ్రహీం చె రువులోకి నీరు చేరుతుంది. కానీ.. ఇక్కడ అలుగునీరు పారే కాలువను వెంచర్‌లో ఓ డ్రైనేజీగా మార్చి నిర్మించడం గమనార్హం. ఇక పెద్దగా ఉన్న కుంటను క్రమక్రమంగా చిన్నగా మార్చేశారు.

రూ.కోట్లు కొల్లగొడుతూ..

నిర్మల్‌ జిల్లాకేంద్రమైన తర్వాత భూముల విలువ ఆకాశాన్నంటాయి. ఎకరం రూ.కోట్లలో పలుకుతోంది. అలాంటి విలువైన ప్రభుత్వ భూములను కబ్జా పెట్టడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అయ్యప్ప టెంపుల్‌ (మల్లన్నగుట్ట) ఏరియాలోని 534, 535 తదితర సర్వే నంబర్లలో అసైన్డ్‌ భూముల్లోనే ఇష్టారీతిన వెంచర్లు చేశారు. కొన్నిచోట్ల ము న్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌లో ఉన్న రోడ్లనూ మాయంచేసి ప్లాట్లుగా మలిచి అమ్మేశారు. ఇక్కడ కేవలం ఒక్క ప్లాట్‌ ధరనే రూ.40–50 లక్షల వరకు ఉందంటే.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బడాబాబులు ఎకరాల్లో కబ్జా చేసిన సర్కారు జాగా ఎన్ని కోట్లు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అసైన్డ్‌ పేరిట చేస్తున్న భూకబ్జాలపై ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా అధికారులు ‘బుల్డోజర్‌’లు ప్రయోగించాల్సిందేనని నిర్మల్‌వాసులు కోరుతున్నారు.

అసైన్డ్‌ పేరిట భూస్వాహా

జిల్లాకేంద్రంలోని దివ్యనగర్‌, మల్లన్నగుట్ట ప్రాంతంలో అసైన్డ్‌ భూముల పేరిట ప్రభుత్వ స్థలాలను స్వాహా చేస్తున్నారు. 534 సర్వేనంబర్‌లో మొత్తం 29.03 ఎకరాల్లో అసైన్డ్‌ పోనూ మిగతా 2.20 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టారు. తమ భూమితో పాటు సర్కారు జాగాలోనూ అక్రమ నిర్మాణాలు, అడ్డుగోడలు కట్టేశారు. అసలు.. అసైన్డ్‌ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడమే కాకుండా ప్రభుత్వ స్థలాన్నీ కబ్జా చేయడంపై కొన్నేళ్లుగా ఫిర్యాదులు, మీడియా కథనాలు వచ్చినా జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తాజాగా నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి గురువారం కలెక్టర్‌ సమక్షంలోనే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు అయ్యప్ప టెంపుల్‌ ఎదురుగా దివ్యగార్డెన్‌ పక్కన ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను బుల్డోజర్‌తో తొలగింపజేశారు.

నిర్మల్‌1
1/4

నిర్మల్‌

నిర్మల్‌2
2/4

నిర్మల్‌

నిర్మల్‌3
3/4

నిర్మల్‌

నిర్మల్‌4
4/4

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement