నిగ్గదీస్తున్న ‘సాక్షి’ని నిలువరిస్తారా? | - | Sakshi
Sakshi News home page

నిగ్గదీస్తున్న ‘సాక్షి’ని నిలువరిస్తారా?

Oct 18 2025 7:35 AM | Updated on Oct 18 2025 7:35 AM

నిగ్గ

నిగ్గదీస్తున్న ‘సాక్షి’ని నిలువరిస్తారా?

● ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యే ● ఏపీ సర్కారు వెంటనే దాడులు ఆపాలి ● ముక్తకంఠంతో నినదించిన జర్నలిస్టులు

నిర్మల్‌/భైంసాటౌన్‌: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ‘సాక్షి’ దినపత్రికపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని భైంసా డివిజన్‌ ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియా ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎడిటర్‌ ధనంజయరెడ్డిని వి చారణ పేరుతో వేధించడాన్ని నిరసిస్తూ పట్ట ణంలో సబ్‌ కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం పలువు రు జర్నలిస్టులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించిన ‘సాక్షి’ మీడియాపై కూటమి ప్ర భుత్వం కక్ష సాధింపు చర్య

లకు పాల్పడడం సరికాదని పేర్కొన్నారు. మీడి యా స్వేచ్ఛ హరించేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమ కేసులతో బెదిరింపులకు పాల్పడడం ప్ర జాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని తెలిపారు. ‘సాక్షి’ యాజమాన్యం, పాత్రికేయులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశా రు. కార్యక్రమంలో జర్నలిస్టులు కృష్ణ, లింగారా వు, రామకృష్ణ, రామకృష్ణ, మార్కండేయ, సతీ శ్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ముక్తకంఠంతో ఖండిస్తున్నాం

ఆంధ్రపదేశ్‌ పోలీసులు విచారణ పేరిట ‘సాక్షి’ ఎడిటర్‌, జర్నలిస్టులపై గత కొద్దిరోజులుగా నిర్బంధకాండ కొనసాగిస్తున్నారు. ఇది ముమ్మాటికీ పత్రికాస్వేచ్ఛను హరించడమే. దీన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నాం.

– వెంకగారి భూమయ్య, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి

దాడులు సమంజసం కాదు

‘సాక్షి’ దినపత్రికపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం పత్రికాస్వేచ్ఛపై దాడే. రాజకీయ కక్షను పత్రికపై తీర్చుకోవడం ఏమాత్రం సమంజసం కాదు. వెంటనే ఏపీ ప్రభుత్వం దాడులు ఆపాలి.

– శ్రీనివాస్‌చారి,

టీడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

పత్రికాస్వేచ్ఛను కాపాడాలి

‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్‌, పాత్రికేయులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పోలీసులు కక్షపూరితంగా వ్యహరిస్తు న్న తీరును పాత్రికేయులంతా ముక్త కంఠంతో ఖండించాల్సిందే. ప్రభుత్వాలు పత్రికాస్వేచ్ఛను కాపాడేలా ఉండాలి. – ధర్మపురి శ్రీనివాస్‌స్వామి,

టీఎస్‌జేయూ రాష్ట్రకార్యదర్శి

రాజకీయ కక్ష సాధింపే..

ఏ మీడియా సంస్థౖపైనెనా ప్రభుత్వాలు, పోలీసులు కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదు. ‘సాక్షి’ ఎడిటర్‌, పాత్రికేయులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాజకీ య కక్షపూరితంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. – బాస లక్ష్మీనారాయణ,

నిర్మల్‌ ప్రెస్‌క్లబ్‌ ప్రధాన కార్యదర్శి

నిగ్గదీస్తున్న ‘సాక్షి’ని నిలువరిస్తారా?1
1/5

నిగ్గదీస్తున్న ‘సాక్షి’ని నిలువరిస్తారా?

నిగ్గదీస్తున్న ‘సాక్షి’ని నిలువరిస్తారా?2
2/5

నిగ్గదీస్తున్న ‘సాక్షి’ని నిలువరిస్తారా?

నిగ్గదీస్తున్న ‘సాక్షి’ని నిలువరిస్తారా?3
3/5

నిగ్గదీస్తున్న ‘సాక్షి’ని నిలువరిస్తారా?

నిగ్గదీస్తున్న ‘సాక్షి’ని నిలువరిస్తారా?4
4/5

నిగ్గదీస్తున్న ‘సాక్షి’ని నిలువరిస్తారా?

నిగ్గదీస్తున్న ‘సాక్షి’ని నిలువరిస్తారా?5
5/5

నిగ్గదీస్తున్న ‘సాక్షి’ని నిలువరిస్తారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement