
బంద్‌ను విజయవంతం చేయాలి
నిర్మల్ టౌన్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఈనెల 18న తలపె ట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని బీసీ సంఘం జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్మల్ ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. అగ్ర కులాల వారు ఓర్వలేక హైకోర్టులో కేసు వేసి బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నమ్మిస్తూ.. రాజకీయ డ్రామా చేస్తోందని మండిపడ్డారు. రాజకీయంగా బీసీలు ఎదగకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 60శాతం ఉన్న బీసీలను రాజకీయంగా వెనుకకు నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 42శాతం రిజర్వేషన్ అమలు కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామ ని హెచ్చరించారు. బంద్‌కు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు పొన్నం నారాయణగౌడ్, నాయకులు అనుముల భాస్కర్, డాక్టర్ కత్తి కిరణ్, అశోక్‌నాయక్, ప్రశాంత్, శివాజీ గౌడ్, నవీన్ తదితరులున్నారు.