
పెన్షనరీ బెనిఫిట్స్ కోసం కలెక్టర్‌కు వినతి
నిర్మల్‌చైన్‌గేట్:రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించేలా ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి, పెన్షన్ల సంఘ జిల్లా అధ్యక్షుడు ఎంసీ.లింగన్న, లోలం గంగన్న , పోతారెడ్డి, కే రమేశ్, పి.జనార్దన్, బి.కిషన్‌రావు, పోతన్న, పోశెట్టి, వేణుగోపాల్, కే.రాములు, జాప రాములు, లక్ష్మణ్, రాజేశ్వర్, గంగాధర్, కరీం, హుస్సేన్, యూసుఫ్ అహ్మద్ పాల్గొన్నారు.