
కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి..
నిర్మల్‌చైన్‌గేట్:జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400 ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్, మేడిసెమ్మ రాజు, తక్కల రమణారెడ్డి, సత్యం చంద్రకాంత్, విలాస్, ఒడిసెల అర్జున్, సాగర్, పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, మార్కెట్ కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.