
ఎల్టా జిల్లా కార్యవర్గం ఎన్నిక
నిర్మల్ రూరల్: ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా) జిల్లా నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కె.వేణుగోపాలరావు, ప్రధాన కార్యదర్శిగా అల్లూరి రామ్మోహన్, వ్యవస్థాపక అధ్యక్షుడిగా కడార్ల రవీంద్ర, స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్‌గా భూమన్నయాదవ్, జాయింట్ సెక్రెటరీగా లక్ష్మీపతి, గౌరవ అధ్యక్షుడిగా చంద్రశేఖర్‌రావు, ట్రెజరర్‌గా రతన్‌కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా మంత్రి ప్రకాశ్, ఉపాధ్యక్షులుగా గంగామోహన్, సునీల్‌రెడ్డి, గంగా కిషన్, రాజేశ్వర్‌రెడ్డి, గణపతి, ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా నవీన్‌గౌడ్, గంగాధర్, తిరుమల్‌రెడ్డి, ముత్తన్న, రాహుల్, ఎర్రన్న, చంద్రశేఖర్‌రెడ్డి, చిన్నారెడ్డి, రాజేశ్వర్, మహిళా కార్యదర్శులుగా సంధ్యారాణి, లక్ష్మి, గీతారామచందర్, స్వాతి, విక్రాంతి, శైలజ ఎన్నికయ్యారు.

ఎల్టా జిల్లా కార్యవర్గం ఎన్నిక