‘మద్యం’.. దూరం పెట్టండి | - | Sakshi
Sakshi News home page

‘మద్యం’.. దూరం పెట్టండి

Oct 18 2025 7:35 AM | Updated on Oct 18 2025 7:35 AM

‘మద్యం’.. దూరం పెట్టండి

‘మద్యం’.. దూరం పెట్టండి

● బడులు, గుడుల దగ్గర వద్దు.. ● జనాలను ఇబ్బంది పెట్టొద్దు.. ● పలు చోట్ల అభ్యంతరాలు

టెండర్ల దశలోనే ఫిర్యాదులు

నిర్మల్‌: మద్యం దుకాణాల టెండర్ల వేళ పలు గ్రా మాల ప్రజలు వైన్‌షాపులపై ఫిర్యాదులు చేస్తున్నా రు. తమకు ఇబ్బందికరంగా ఉన్న దుకాణాలను తొ లగించాలని గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి డి మాండ్‌ చేస్తున్నారు. ఆయా గ్రామాల ప్రజలంతా కలెక్టరేట్‌కు వచ్చి నేరుగా ప్రజావాణిలో కలెక్టర్‌ దృష్టికి తెస్తున్నారు. మద్యం దుకాణాలను ఇప్పుడు మార్చకపోతే మరో రెండేళ్లు తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు. ఆయా ఫిర్యాదులపై కలెక్టర్‌ సానుకూలంగా స్పందిస్తున్నారు.

బడికి.. గుడికి దగ్గరలో..

ఎకై ్సజ్‌ శాఖ నిబంధనల ప్రకారం బడి, ప్రార్థన మందిరాలకు కనీసం 100మీటర్ల దూరంలో మ ద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలి. జాతీయ రహదారులకు 50మీటర్ల దూరంలో ఉండాలి. చాలా చోట్ల నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు ఏ ర్పాటు చేయడంలేదు. కొన్నిచోట్ల పాఠశాలలు, ఆలయాలు, నివాస సముదాయాలకు ఇబ్బంది కలిగించేలా ఏర్పాటు చేశారు. జిల్లాకేంద్రంలో దాదాపు ఐదారు దుకాణాలు హైవేపైనే ఉన్నాయి. మండల కేంద్రాలు, మేజర్‌ గ్రామాల్లో చాలాచోట్ల పాఠశాలలకు వెళ్లేదారుల్లోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. వీటిపై ఎన్నిసార్లు ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోవడం లేదు.

రోడ్డుపైనే తాగుతూ..

దిలావర్‌పూర్‌ మండలం సిర్గాపూర్‌ గ్రామంలో రో డ్డుపైనే మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. ఇక్కడ తరచూ మందుబాబులు రోడ్డుపైనే బైక్‌లు నిలిపి మద్యం సేవిస్తున్నారు. గ్రామస్తులు పలుసార్లు చె ప్పినా తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మద్యం సేవించిన తర్వాత ఇష్టారీతిన వాహనాలు నడపడంతో ప్రమాదాలూ జరుగుతున్నాయి. చీకటి పడుతోందంటే మహిళలు ఆ దారి లో వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. ఒంటరి మ హిళలైతే జంకుతున్నారు. భైంసాలోనూ ఓ ప్రైవేట్‌ పాఠశాలకు సమీపంలోనే మద్యం దుకాణం ఉంది. ఇక్కడ కూడా పలుసార్లు అభ్యంతరాలు వచ్చాయి. కుంటాల మండల కేంద్రంలో విద్యార్థులు, మహిళలకు ఇబ్బందికరంగా మద్యం దుకాణం ఉందని స్థానికులు అభ్యంతరం తెలుపుతున్నారు.

ఇప్పుడు మారిస్తేనే..

సమాజాన్ని మత్తులో ముంచే మద్యానికంటే ముందు గ్రామాన్ని ఉన్నతంగా నిలిపే విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని పల్లె ప్రజలు కోరుతున్నారు. పాఠశా లలు, ఆలయాలు, బీడీ కంపెనీలు, రోడ్లకు దగ్గరలో మద్యం దుకాణాలు పెట్టి ఇబ్బందుల పాలుచేయొద్దని కోరుతున్నారురు. సిర్గాపూర్‌లో ఏకంగా మద్యం దుకాణం వద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశా రు. గ్రామ పెద్దలంతా కలిసి కలెక్టరేట్‌లో పలుసార్లు కలెక్టర్‌ను కలిసి విన్నవించారు. కలెక్టర్‌, అధికారులు సానుకూలంగా స్పందించగా.. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొత్త దుకాణాల కు మళ్లీ పాతచోట అనుమతివ్వొద్దని, తమను మ రో రెండేళ్లు ఇబ్బంది పెట్టొద్దని వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement