
కాంగ్రెస్ పథకాలను కాపీ కొడుతున్న బీజేపీ
నిర్మల్‌చైన్‌గేట్: కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను బీజేపీ కాపీ కొడుతోందని ఏఐసీసీ పరిశీలకులు అజయ్‌సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావుతో కలిసి సోమవారం మాట్లాడారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ‘సంఘటన్ సుజన్ అభియాన్’’ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు నూతన అధ్యక్షులను ఎంపిక చేసేందుకు ఏఐసీసీ పరిశీలకులను నియమించిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మూడేళ్ల గడువు ఉందని, కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామ స్థాయిలో ఇంటింటికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, సారంగాపూర్, నిర్మల్, భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు అబ్దుల్ హాది, సోమా భీమ్‌రెడ్డి, ఆనంద్‌రావు పటేల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ, ఆత్మ కమిటీ చైర్మన్ రాంరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దుర్గాభవాని, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అల్లూరు కృష్ణవేణి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సమరసింహారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
కార్యకర్తల అభిప్రాయం మేరకే పార్టీ పదవులు
ఖానాపూర్: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల నియామకంలో కార్యకర్తల అభిప్రాయానికి మొదటి ప్రాధాన్యం ఇస్తామని ఏఐసీసీ పరిశీలకులు, కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్యే అజయ్‌సింగ్ అన్నారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ అధ్యక్షతన ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సోమవారం నిర్వహించిన సంఘటన్ సీజన్ అభియాన్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. పార్టీ పదవుల కోసం ముఖ్య నాయకులు సైతం ఢిల్లీకి వచ్చేవారని అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ నుంచే పార్టీ దూతలు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్‌చోరీ ద్వారా మరోసారి అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. సమావేశంలో రాష్ట్ర పరిశీలకులు ధన్వంత్ తరి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, కేంద్ర మాజీమంత్రి వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, సేవాదళ్ అధ్యక్షుడు జితేందర్, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వర్, వెంపటి రాజేశ్వర్, కృష్ణవేణి, మల్లారెడ్డి, దయానంద్, పడిగెల భూషణ్, ఎంఏ.మాజిద్, చిన్నం సత్యం, తోట సత్యం, నిమ్మల రమేశ్ పాల్గొన్నారు.