
నిర్మల్
న్యూస్‌రీల్
పీఎంశ్రీలో కరాటే, కుంగ్‌ఫూ
యాసంగిలోనైనా నీరందేనా..
గడ్డెన్నవాగు నీరు యాసంగి పంటలకు అందుతుందనేది అనుమానంగానే ఉంది. భారీ వర్షాలతో ఉపకాలువలు కోతకు గురయ్యాయి. ప్రధాన కాలువలు దెబ్బతిన్నాయి.
రాష్ట్రస్థాయిలో ప్రతిభ
లక్ష్మణచాంద: మహబూబ్‌గర్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర జూనియర్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో మండలంలోని వడ్యాల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అరుణ్ కుమార్, రాజు ప్రతిభ కనబర్చారు. సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులకు ఎంఈవో అశోక్‌వర్మ సర్టిఫికెట్లు అందజేశారు. జాతీయస్థాయిలోనూ రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రెటరీ రవీందర్‌గౌడ్, పీఈటీ రమణారావు, పీడీ నచ్చేందర్, సీఆర్పీ సుధాకర్ పాల్గొన్నారు.
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యాసంస్థలకు సరితూగేలా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ‘‘పీఎంశ్రీ (ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా)’’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి, విద్యార్థులకు నాణ్యమైన విద్య, ప్రగతిశీలమైన వాతావరణం అందిస్తోంది. ఇప్పటికే ల్యాబ్, లైబ్రరీ, సంగీతం కోసం నిధులు కేటాయించింది. తాజాగా బాలికల భద్రతకు ప్రాధాన్యం ఇస్తోంది.
బాలికల ఆత్మరక్షణ కోసం..
పీఎంశ్రీ పథకంలో భాగంగా బాలికల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతీ పాఠశాలకు రూ.30 వేల చొప్పున నిధులు మంజూరు చేసింది. జిల్లాలోని 17 పీఎంశ్రీ పాఠశాలలకు ఈ నిధులు ఇప్పటికే విడుదల అయ్యాయని జిల్లా అధికారులు తెలిపారు.
కరాటే, కుంగ్‌ఫూ, జూడో శిక్షణ...
ప్రతీరోజు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో బాలికలు తమను తాము రక్షించుకునే ధైర్యం పొందడం అవసరమని కేంద్రం అభిప్రాయపడింది. అందుకే పీఎంశ్రీ పాఠశాలల్లో కరాటే, కుంగ్‌ఫూ, జూడో వంటి ఆత్మరక్షణ శిక్షణ అందించేందుకు ఈ నిధులు వినియోగించాలని సూచించింది.
నేరుగా ఇన్‌స్ట్రక్టర్ల ఖాతాల్లోకి..
ఇంతకుముందు పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లో నిధులు జమ చేసి, వాటిని శిక్షకులకు చెల్లించే విధానం ఉండేది. ఈ విద్యా సంవత్సరం నుంచి కేంద్రం విధానాన్ని మార్చింది. ఇప్పుడు నేరుగా ఇన్‌స్ట్రక్టర్ల ఖాతాల్లోనే నిధులు జమ చేస్తోంది. నెలకు రూ.10 వేల చొప్పున, మూడు నెలల శిక్షణకు రూ.30 వేలు చెల్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
లక్ష్మణచాందలో శిక్షణ పొందుతున్న విద్యార్థినులు
శిక్షణ తరగతులు ఇలా..
ప్రతీ పాఠశాలలో కనీసం 72 శిక్షణ తరగతులు నిర్వహించేలా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వారంలో కనీసం రెండు లేదా మూడు రోజులు పీడీ, పీఈటీ పర్యవేక్షణలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని సూచించింది. కరాటే, కుంగ్‌ఫూ, జూడో శిక్షణలతో బాలికలలో ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

నిర్మల్