
భైంసాలో రావణ దహనం ప్రత్యేకం
భైంసాటౌన్: దసరా రోజు సాయంత్రం భైంసాలో పట్టణంలో రావణ దహనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు. పట్టణంలోని కిసాన్‌గల్లిలోగల బాగుబాయి గుట్టపై సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు బాబన్న, ప్రవీణ్, శంకర్, విశాల్, ప్రకాశ్ ఆధ్వర్యంలో ఏటా దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు రూ.లక్షకుపైగా వెచ్చించి గుట్టపై రావణ ప్రతిమను ఏర్పాటు చేసి పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులను ఆహ్వానించి కార్యక్రమం ప్రారంభిస్తారు. భారీ టపాసుల పేలుళ్లతో జరిగే రావణ ద హనం కార్యక్రమాన్ని వీక్షించేందుకు పట్టణ ప్రజలు భారీసంఖ్యలో తరలివస్తారు. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సంతోషంగా గడుపుతారు.