
మద్యం దుకాణాలకు 7 దరఖాస్తులు
నిర్మల్‌టౌన్: జిల్లాలోని మద్యం దుకాణాలకు సోమవారం ఏడు దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి అబ్దుల్ రజాక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు ఈనెల 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 23న లాటరీ పద్ధతిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేస్తామన్నారు. ప్రతీ దరఖాస్తుకు రూ.3 లక్షలు రుసుముగా నిర్ణయించామని, ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా అందజేయవచ్చన్నారు. గౌడ కులస్తులకు 3, ఎస్సీలకు 5, ఎస్టీలకు 1 రిజర్వేషన్ కల్పించామన్నారు. డీడీలు, చలాన్లు జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అధికారి నిర్మల్ పేరున తీయాలని, దరఖాస్తు ఫారం జిల్లా కార్యాలయంలో లేదా హైదరాబాద్ ఎకై ్సజ్ కార్యాలయంలో అందజేయాలన్నారు.