
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
స్థానిక
సంస్థల
నిర్మల్‌చైన్‌గేట్: స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే పలు దశల్లో అధికారులందరికీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నా రు. ఎస్పీ మాట్లాడుతూ రెవెన్యూ, ఇతర అధి కారుల సమన్వయంతో జిల్లాలో ఎన్నికలు ప్రశా ంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నా రు. కోడ్ అమలులో ఉన్నందువల్ల సరైన పత్రాలు లేకుండా రూ.50 వేల నగదును వెంట తీసుకు వెళ్లరాదన్నారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, డీపీఆర్‌ఓ విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులు త్వరగా
పరిష్కరించాలి
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలన్నారు. అనంతరం ఇటీవల నిర్మల్ జిల్లాకు జల్ సంచాయ్–జన భాగిధారి కార్యక్రమంలో అవార్డు లభించడంతో అధికారులను అభినందించారు. భవిష్యత్‌లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ మరిన్ని అవార్డులు సాధించి జిల్లా పేరును దేశవ్యాప్తంగా నిలపాలన్నారు.
ప్రజావాణి తాత్కాలిక వాయిదా..
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలన్నారు. అధికారులంతా ఎన్నికల కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎలక్షన్ కోడ్ జిల్లాలో పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
దుర్గాదేవి నిమజ్జన ఏర్పాట్లు పరిశీలన
నిర్మల్‌చైన్‌గేట్: దుర్గాదేవి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. దుర్గాదేవి విగ్రహాలను నిమజ్జనం చేసే వినాయక సాగర్ చెరువు (బంగల్పేట్ చెరువు)ను ఆమె పరిశీలించారు. ప్రజలు చెరువులోకి దిగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అంతకుముందు బంగల్‌పేట్ మహాలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కలెక్టర్‌కు అమ్మవారి ఫొటోను బహూకరించారు. పూజారులు ఆలయ చరిత్రను, విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ పాల్గొన్నారు.