
పూలే స్ఫూర్తితో కులనిర్మూలనకు కృషి
నిర్మల్‌చైన్‌గేట్: జ్యోతిరావు పూలే స్ఫూర్తితో కుల నిర్మూలనకు కృషి చేద్దామని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నందిరామయ్య పిలుపునిచ్చా రు. సోమవారం జిల్లా కేంద్రంలో గల ప్రభు త్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవన్‌లో కుల నిర్మూలన జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే 1873 సెప్టెంబర్ 24న సత్యశోధకు సమాజ్ అనే సంస్థను ఏర్పాటు చేసి దేశంలో అంటరానితనం, కుల నిర్మూలన జరగాలని పోరాడారన్నారు. జిల్లా కార్యదర్శి కే.రాజన్న మాట్లాడుతూ కులాలు, మతాలను ప్రోత్సహించి అధికారాన్ని కాపాడుకుంటున్నారని, ప్రజా సమస్యలను పరిష్కరించలేకపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్, సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ (ప్రజాపంథా) నాయకులు ఎం.బక్కన్న, ఆర్.రామలక్ష్మణ్, ఎస్.గంగన్న, గపూర్, గంగామణి, ఎస్.లక్ష్మి, దేవక్క, భీమవ్వ, ఫెరోజ్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న జిల్లా కార్యదర్శి కే.రాజన్న