
మస్తు ఆశలుండే
ఈసారి మొదటి నుంచి వర్షాలు విస్తారంగా కురియడంతో మొక్కజొన్న సాగుచేయాలని నిర్ణయించుకున్నా. కానీ ఆశించిన మేర పంట దిగుబడి వచ్చేలా కనిపించడంలేదు. మొక్కజొన్న కంకులకు ఎక్కడ చూసినా మొలకలే కనిపిస్తున్నాయి.
– రాథోడ్ బలీరాం, నగర్‌తండా
దిగుబడి కష్టమే
అధిక వర్షాలు కురవడం వల్ల ఈ సారి సాగు చేసిన పంటలు చేతికి రావడం కష్టమే. పెట్టుబడులు సైతం మునగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతీ కర్రకు మొలకలే కనిపిస్తున్నయ్. సోయా, పత్తి పంటలకు కూడా మొలకలు వస్తున్నయ్.
– ప్రవీణ్, రాయాపూర్‌కాండ్లీ
ఉన్నతాధికారులకు నివేదిస్తాం
మొక్కజొన్న పంట ఇప్పుడిప్పుడే చేతికి అందివస్తోంది. రైతులు చేలల్లో పంట ఆరబెట్టుకునేందుకు ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేసుకోవాలి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలను అధికారులచేత సర్వే చేయించాం. ఉన్నతాధికారులకు నివేదిస్తాం
– అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి

మస్తు ఆశలుండే