
జిల్లా కవులకు పురస్కారాలు
నిర్మల్‌ఖిల్లా: నిర్మల్‌కు చెందిన పలువురు కవులు సాహితీరంగంలో పురస్కారాలు స్వీకరించారు. పత్తి శివప్రసాద్, తుమ్మల దేవరావ్, అంబటి నారాయణ, వెంకట్, జాదవ్ పుండలీక్‌రావు సాహితీ కిరీటి ప్రతిభా జాతీయ పురస్కారాలు, పోలీస్ భీమేశ్ యువ సాహితీ కిరీటి పురస్కారం స్వీకరించారు. హైదరాబాద్‌లోని బిర్లా ప్లాంటోరియం, ఆడిటోరియంలో ఆదివా రం నిర్వహించిన శ్రీశ్రీకళావేదిక 155వ సాహి తీ పట్టాభిషేక మహోత్సవంలో సంస్థ డైరెక్టర్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు జీ ఈశ్వరీభూషణం, జాతీయ యువజన అధ్యక్షుడు గరిమెళ్ల రాజేంద్రప్రసాద్ తదితరుల చేతులమీదుగా పురస్కారాలు అందుకున్నారు. వీరికి జ్ఞాపిక, శాలువా, ప్రశంసాపత్రం అందజేసి సత్కరించారు. వీరిని జిల్లాకు చెందిన పలువురు అభినందించారు.