
రిజర్వేషన్ల పంచాయితీ
10లోu
న్యూస్‌రీల్
ఒక్క ఓటరూ లేని వర్గాలకు అవకాశాలు పోటీ చేసే వారే లేరని స్థానికుల ఆందోళన కేటగిరీలు మార్చాలని డిమాండ్లు ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లలో విచిత్రం
దస్తురాబాద్ మండలం పెర్కపల్లెలో 554 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో నలుగురు ఎస్టీ ఓటర్లు ఉండగా, మిగతా వారంతా బీసీలే. ఇక్కడ ఎస్సీలు లేరు. కానీ సర్పంచ్ అభ్యర్థిగా ఎస్సీ రిజర్వేషన్ ఖరారైంది.
కుభీర్ మండలం ఫకీర్‌నాయక్ తండా, దావూజీ నాయక్ తండాలో గిరిజనులే ఉండగా, ఇక్కడ బీసీ రిజర్వేషన్ కేటాయించారు.
పెంబి మండలం వేణునగర్‌లో అందరూ గిరిజనులే ఉండగా, బీసీ జనరల్ రిజర్వేషన్ వచ్చింది.
2019లో వేమనపల్లి మండలం రాజారం గ్రామం ఎస్సీ రిజర్వు కాగా, అక్కడ ఎస్సీలు ఎవరూ లేక ఎన్నిక జరగలేదు. తాజాగా ఎస్సీలకే కేటాయించారు. ఇక కల్లంపల్లి(ముక్కిడిగూడెం) పరిధిలో ఎస్సీ, ఎస్టీలు తప్ప బీసీలు లేరు. కానీ ఇక్కడ బీసీకి కేటాయించారు.
బెజ్జూరు మండలం తుమ్మలగూడలో పూర్తిగా ఎస్సీలే ఉండగా, ఇక్కడ బీసీ జనరల్ రిజర్వు అయింది.
నేరడిగొండ మండలం సావర్గం, పీచర, ఆరేపల్లి పరిధిలో బీసీ రిజర్వేషన్ వచ్చింది. అయితే ఇక్కడ బీసీలు ఒక్కరూ లేరు.
దండేపల్లి మండలం గూడెం గిరిజన ఏజెన్సీ గ్రామం. ఎస్టీలకే సర్పంచ్, వార్డు స్థానాలు రిజర్వు ఉన్నా గిరిజన జనాభా లేక గత 40ఏళ్లుగా సర్పంచ్ ఎన్నిక జరగడం లేదు. తాజాగా ఎస్టీ జనరల్‌కు అవకాశం వచ్చింది. ఇదే మండలం నెల్కివెంకటాపూర్ నుంచి వందర్‌గూడను వీడి కొత్తగా పంచాయతీ ఏర్పాటు చేసి ఎస్టీకి కేటాయించారు. నెల్కివెంకటాపూర్ ఏజెన్సీ పరిధిలో కావడంతో ఎస్టీలకు రిజర్వు కావడంపై స్థానికుల నుంచి అభ్యంతరాలతో ఎన్నికలు జరగడం లేదు.
సారంగాపూర్ మండలం హనుమాన్ తండాలో 546 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 12 మంది ఎస్సీ ఓటర్లు ఉన్నారు. బీసీ ఓటర్లు ఎవరూ లేరు. పెండల్‌దరి గ్రామంలో 486 మంది జనాభాతో 233 మంది ఎస్టీ ఓటర్లు ఉన్నారు. ఇక్కడ కూడా బీసీ ఓటర్లు లేరు. ఈ గ్రామాలు పూర్తిగా ఎస్టీ జనాభా ఆధారితమై ఉండగా, రిజర్వేషన్ జాబితాలో బీసీలకు కేటాయించారు.
నిర్మల్
161బీబీ రహదారి
పొడిగింపునకు చర్యలు
భైంసాటౌన్: నియోజకవర్గంలో చేపడుతున్న 161బీబీ హైవేను మహారాష్ట్రలోని మాహోర్ వ రకు పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ తెలిపారు. పట్టణంలోని తన నివాసంలో మంగళవారం మాట్లాడారు. 161బీబీ హైవే ను 161ఏ హైవేకు అనుసంధానించాలని గతంలో కేంద్ర రోడ్డు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విన్నవించినట్లు పేర్కొన్నారు. స్పందించిన ఆయన సంబంధిత అధి కారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే రహదారి పొడిగింపునకు మార్గం సుగ మం అవుతుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశా రు. పొలంబాట కింద నియోజకవర్గంలో వ్యవసాయ క్షేత్రాలకు మొరం రోడ్ల నిర్మాణానికి రూ.7.97 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.
మార్గ సూచి.. ప్రయోజనకారి
పాఠశాలల్లో అకడమిక్ క్యాలెండర్ పంపిణీ కి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. బోధన, పరీక్షలు, సెలవులు, వార్షిక కార్యక్రమాల షెడ్యూల్ పొందుపర్చింది.
ఎందుకీ పరిస్థితి?
2011 నాటి జనాభా లెక్కలతో ఎస్సీ, ఎస్టీ వర్గాలు, రాష్ట్రంలో నిర్వహించిన సామాజిక ఆర్థిక కుల గణన సర్వేను పరిగణనలోకి తీసుకుని బీసీలకు రిజర్వేషన్ల ర్యాంకింగ్ ఇచ్చారు. బీసీ వర్గాల రిజర్వేషన్లకు డెడికేషన్ కమిషన్ సిఫారసులు పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్రంలో 2019 తర్వాత ఇప్పుడు జరుగుతున్న రెండో స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్, ఎంపీటీసీ మండలం యూనిట్‌గా, జెడ్పీటీసీ జిల్లా యూనిట్‌గా ర్యాంకింగ్‌లు ఇచ్చే క్రమంలో ఆయా వర్గాల్లో జనాభా లేనప్పటికీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇక మహిళలకు 50శాతం, వంద శాతం ఎస్టీలు ఉన్న చోట్ల వారికే నోటిఫై చేయడం వంటి నిబంధనలు పాటించాల్సి ఉంది. ఎస్టీ, ఎస్సీ, బీసీల ర్యాకింగ్ ఇచ్చే క్రమంలో ఒక్క ఓటరు లేని వర్గాలకు కూడా ఆయా చోట్ల రిజర్వేషన్లు ప్రకటించాల్సి వచ్చింది. ఇక గత ఎన్నికల్లో ఏదైనా కారణంతో ఎన్నిక జరగకపోతే ఆయా వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లు అనుభవించని కారణంగా మరోసారి వారికే అవకాశం కల్పించేలా జీవో జారీ చేశారు. ఇక షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులే పోటీకి అర్హులు. దీంతో ఏ గ్రామంలోనైనా గిరిజనులు ఉన్నా లేకున్నా వారికే అవకాశాలు వస్తున్నాయి. గతంలో జనాభా లెక్కల సమయంలోనూ కొన్ని చోట్ల ఆయా వర్గాల వివరాల నమోదులో తప్పిదాలు జరగడంతోనూ ఇబ్బందులు వస్తున్నాయి. మళ్లీ జనాభా లెక్కలు జరిగి, ఆయా వర్గాల వివరాలు స్పష్టత వచ్చే వరకు ఈ పరిస్థితి మారే అవకాశం లేదు.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పంచాయితీ మొదలైంది. పలు గ్రామాల్లో పోటీలో నిలబడేందుకు అభ్యర్థులే లేని పరిస్థితి నెలకొంది. దీంతో తమ గ్రామాల్లో రిజర్వేషన్ల ఖరారుపై పునః పరిశీలన చేయాలని విన్నవిస్తున్నారు. కొన్ని చోట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను కలుస్తూ రిజర్వేషన్లు మార్చాలని కోరుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత మార్చే అవకాశం లేకపోవడంతో ఆ గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే సందిగ్ధత నెలకొంది.
జనాభా లేకున్నా అవకాశాలు
ఉప సర్పంచ్‌లకే పగ్గాలు
సర్పంచ్ పదవులు ఆయా వర్గాలకు రిజర్వు కావడంతో వార్డు స్థానాలకు ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. దీంతో వార్డు సభ్యులు తమలో ఒకరిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకుంటున్నారు. దీంతో సర్పంచ్ ఎన్నిక జరగని చోట్ల రిజర్వేషన్ వర్తించని ఉప సర్పంచ్‌లే సర్పంచ్ హోదాలో పాలన కొనసాగించే అవకాశం ఉంది.

రిజర్వేషన్ల పంచాయితీ