
హిందువుల ఐక్యతకే పంచ పరివర్తన్
నిర్మల్‌ఖిల్లా: హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్ ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ కృషి చేస్తోందని ఇందూర్ విభాగ్ కార్యవాహ రాజులవార్ దిగంబర్ పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది వందేళ్ల స్థాపన ఉత్సవాల్లో భాగంగా ఆర్‌ఎస్‌ఎస్ మంజులాపూర్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం విజయదశమి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925లో ప్రారంభమై దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో, విభిన్న రంగాల్లో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని వివరించా రు. దేశ అభివృద్ధి కోసం హిందువులు పంచ పరి వర్తన కోసం పాటుపడాలని సూచించారు. ముఖ్యఅతిథిగా హాజనైన సద్గురు మహాదేవస్వామి మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ దేశ అఖండతకు, వ్యక్తి నిర్మాణానికి, హిందుత్వ పరిరక్షణకు చేపడుతున్న చర్యలు స్వాగతించాలని కోరారు. జిల్లా సహ కార్యవాహ మంచిరాల నాగభూషణం, కిన్నెర్ల రవి, నార్లపురం రవీందర్, వల్లెపు శివ, నారి విక్రమ్, అయిండ్ల సాత్విక్, తాండ్ర సుశాంత్, చిన్నయ్య, సుదర్శన్‌చారి పాల్గొన్నారు.