
ఎకై ్సజ్ ఎస్సై నుంచి డీటీగా..
కుంటాల: మండల కేంద్రానికి చెందిన కార్గాం లక్ష్మి–భూమన్న దంపతుల కుమారుడు గోవర్ధన్ గ్రూప్–2లో ప్రతిభ కనబరిచి డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. గోవర్ధన్ 2011లో ఎస్‌బీఐ మేనేజర్‌గా ఉద్యోగం సాధించి విధుల్లో చేరారు. 2020లో నిర్వహించిన గ్రూప్–2లో ప్రతిభ కనబరిచి ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా భీంగల్ ఎకై ్సజ్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రూప్–2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్ (డీటీ)గా ఎంపికయ్యారు. గోవర్ధన్‌ను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.