
సహకార సంఘం పాలకవర్గం ఎన్నిక
నిర్మల్‌ఖిల్లా: లోకమాన్య పరస్పర సహాయ పరప తి, సహకార సంఘం లిమిటెడ్ నిర్మల్ జిల్లా పాలకవర్గ సభ్యులను ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లాకేంద్రంలోని స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో రెండో వార్షిక మహాసభ సర్వసభ్య సమావే శం, అనంతరం ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. నూతన పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికై న ట్లు ఎన్నికల పరిశీలకులు ప్రకటించారు. చైర్మన్‌గా భూసారపు గంగాధర్, వైస్ చైర్మన్‌గా శివరాం వెంకటేశ్, జనరల్ సెక్రటరీగా సతీశ్, క్యాషియర్‌గా అన్నం వసుదేవరెడ్డి, జాయింట్ సెక్రటరీగా నరేందర్‌రెడ్డి, జాయింట్ ట్రెజరర్‌గా శ్రీనివాస్, డైరెక్టర్లుగా అనురాధ పంపట్‌వార్, ఓటారికారి విద్యాసాగర్, కుంచంవార్ మోరేశ్వర్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికా రిగా ఉప్పులూటి రవికుమార్ తెలిపారు. సలహా క మిటీ సభ్యులుగా నూకల విజయ్‌కుమార్, నార్లపు రం రవీందర్, మంచిరాల నాగభూషణంను ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా తుమ్మల ప్రమోద్ చంద్రారెడ్డి, వక్తగా సహకార భారతి తెలంగాణ రాష్ట్ర క్రెడిట్ సెల్ ప్రముఖ్ బాబుచంద్ హాజరయ్యారు.