
ప్రజలకు చేరువయ్యేలా కమ్యూనిటీ బతుకమ్మ
● ఏఎస్పీ రాజేశ్ మీనా
ఖానాపూర్: ప్రజలకు మరింత చేరువయ్యేందుకే ఎస్పీ జానకీషర్మిల ఆధ్వర్యంలో కమ్యూనిటీ బతుకమ్మ కార్యక్రమం చేపట్టామని ఏఎస్పీ రాజేశ్ మీనా అన్నారు. పట్టణంలోని శ్రీరాంనగర్ దుర్గామాత మండపం వద్ద శనివారం కమ్యూనిటీ బతుకమ్మ కార్యక్రమంలో మాట్లాడారు. కమ్యూనిటీ బతుకమ్మ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతోపాటు మహిళల రక్షణపై పోలీసుశాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. పోక్సో చట్టంతోపాటు ర్యాష్ డ్రైవింగ్, మైనర్‌డ్రైవింగ్, లైగింక దాడుల నుంచి రక్షణ, సైబర్ నేరాల నియంత్రణ తదితర అంశాలను విషయాలు తెలియజేశారు. అంతకముందు దుర్గామాత మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళల బతుకమ్మ ఆటను వీక్షించారు. కార్యక్రమంలో సీఐ అజయ్, ఎస్సైలు రాహుల్ గైక్వాడ్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.