
లైటింగ్‌తో కొత్తశోభ
సారంగపూర్: స్వర్ణ ప్రాజెక్టు వద్ద లైటింగ్ పునరుద్ధరణతో కొత్తశోభ సంతరించుకుందని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. స్వర్ణ ప్రాజెక్టుపై రూ.32.70 లక్షల వ్యయంతో చేపట్టిన లైటింగ్ పునరుద్ధరణ పనులను శనివారం ప్రారంభించారు. గతంలో ప్రాజెక్టు పూర్తిగా నిండి గేట్లు ఎత్తిన క్రమంలో జౌళి గ్రామ ప్రజలు తమ గ్రామానికి రాత్రివేళ వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. కేవలం ప్రాజెక్టు వద్ద మాత్రమే లైట్లు ఉండేవని ఆనకట్ట పొడవునా, ఆనకట్టు కిందగల జౌళి రహదారి పక్కన మొత్తం చీకటి అలుముకునేదన్నారు. అందుకే లైట్ల పునరుద్ధరణ పనులను చేపట్టినట్లు తెలిపారు. అనంతరం ప్రస్తుతం ప్రాజెక్టు పరిస్థితి, నీటి విడుదల విషయంలో గేట్ల పరిస్థితిని గురించి ఈఈ అనిల్, ఎస్‌ఈ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీటి వివరాలను సైతం అడిగి తెలుసుకున్నారు. ఇంకా వర్షాల ప్రభావం ఉండడంతో ఎప్పటికప్పుడు పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ గేట్ల ద్వారా నీటిని విడుదల చేయాలని వారికి సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంధ్యారాణి, బీజేపీ నాయకులు రావులరాంనాథ్, సత్యనారాయణగౌడ్, నాయకులు మంతెన గంగారెడ్డి, నరేశ్, చంద్రప్రకాశ్‌గౌడ్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.