
వేతనాల కోసం లేఖలు
నిర్మల్‌ఖిల్లా: డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రతినెలా వేతనాలు ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీరియడ్ల వారీగా ప్రతీనెల రావాల్సిన కనీస వేతనం రూ.28 వేలు సైతం సమయానికి చెల్లించలేకపోవడంతో పండగలు జరుపుకునే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అతిథి అధ్యాపకులు వేతనాలు ఇప్పించాలని సీఎం రేవంత్‌రెడ్డికి లేఖలు రాశారు. మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. 12 నెలల కాలానికి వేతనాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో లేఖలు రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించారు. అతిథి అధ్యాపకుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ సుధాకర్, జిల్లా అధ్యక్షుడు సురేందర్, జిల్లా కార్యవర్గపభ్యులు పాల్గొన్నారు.