
బాసరలో కొనసాగుతున్న శరన్నవరాత్రి వేడుకలు
బాసర: బాసర శ్రీజ్ఞానసరస్వతీ ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం 6వ రోజు అమ్మవారు ‘కాత్యాయనీ దేవి’ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చా రు. నాలుగు భుజాలతో సింహ వాహిణియై ఎడమ చేతుల్లో ఖడ్గం/తాళపత్ర నిధి మరో చేతిలో పద్మం, కుడి చేతుల్లో అభయముద్ర వరదముద్ర కలిగి భక్తులను అనుగ్రహిస్తోంది. ఆలయ వైదికబృందం అ మ్మవారికి చతుషష్టి ఉపచార, మల్లెపుష్పార్చన పూ జలు నిర్వహించి రవ్వ కేసరిని నైవేద్యంగా నివేదించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. పిల్లలకు అక్షర శ్రీకారం చేయించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు...
ఉత్సవాల్లో భాగంగా కోటి గాజుల మండపంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. హైదరాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలతోపాటు మహారాష్ట్రలోని నాందేడ్, పర్బని జిల్లాల కళాకారులు పాల్గొంటున్నారు. అమైర అనే చిన్నారి దాదాపు గంటపాటు ప్రదర్శించిన అద్భుతమైన కూచిపూడి, భరతనాట్యం నృత్యాలు ఆకట్టుకున్నాయి.

బాసరలో కొనసాగుతున్న శరన్నవరాత్రి వేడుకలు