
చికిత్స పొందుతూ మహిళ మృతి
కాగజ్‌నగర్‌టౌన్: అనారోగ్యంతో బాధపడుతూ మూడు రోజులుగా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మండలంలోని సీతానగర్‌కు చెందిన మౌల్‌కార్ అమృత (40) గురువారం రాత్రి మృతి చెందింది. కాగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని ఆరోపిస్తూ బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన వైద్యం అందించకపోవడంతోనే ఒక నిండు ప్రాణం బలైందని, దీనికి ఆస్పత్రి యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు.