
తాళం వేసిన ఇంట్లో చోరీ
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ఏఎన్‌రెడ్డి కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. బాధితుల కథనం ప్రకారం సారంగాపూర్ హైస్కూల్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రమేష్ చందర్‌గౌడ్ ఈనెల 22న కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్రలో ఉంటున్న కూతురు ఇంటికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున పనిమనిషి ఇంటికి వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉంది. విషయాన్ని రమేష్ చందర్‌గౌడ్‌కు ఫోన్ ద్వారా చెప్పడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు ఐదున్నర కేజీల వెండి, తులం నర బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలిపారు. క్లూస్‌టీం, ఫింగర్ ప్రింట్ టీం వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.