
బ్రాండెడ్ పేరిట పీడీఎస్ బియ్యం విక్రయం
ఆదిలాబాద్‌టౌన్: బ్రాండెడ్ బియ్యం పేరిట పీడీఎస్ బియ్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వన్‌టౌన్ సీఐ బీ.సునీల్‌కుమార్ తెలిపారు. గురువా రం వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని చిల్కూరి లక్ష్మీనగర్ కాలనీకి చెందిన షేక్ అయూబ్ పట్టణంలోని శివాజీచౌక్‌లో ఆంధ్రా కిరా ణషాపు నడుపుతున్నాడన్నారు. బ్రాండెడ్ బియ్యం సంచుల్లో పీడీఎస్ బియ్యం నింపి ప్రజలకు విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఆరు క్వింటాళ్ల రాయితీ బియ్యంతో పాటు ఆటోను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే అతనిపై పలు కేసులు న మోదైనట్లు తెలిపారు. నిందితుడి దుకాణా న్ని జప్తు చేసేందుకు ఆదిలాబాద్ ఆర్డీవోకు సిఫార్సు చేసినట్లుగా వెల్లడించారు.