
సింగరేణి కార్మికుడు ఆత్మహత్య
మందమర్రిరూరల్(రామకృష్ణాపూర్): రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జవహర్‌గర్‌కు చెందిన సింగరేణి కార్మికుడు రెక్కల గోవర్ధన్‌రెడ్డి (39) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఆర్కేపీ సీహెచ్‌పీలో జనరల్ అసిస్టెంటుగా పనిచేస్తున్న గోవర్ధన్‌రెడ్డికి అతని భార్యకు మధ్య బుధవారం రాత్రి గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెంది గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.