
బతుకమ్మ ఆడిన న్యాయమూర్తులు
జిల్లా కోర్టు ఆవరణలో గురువారం సాయంత్రం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా జడ్జి శ్రీవాణి, సివిల్ జడ్జి రాధిక, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి భవిష్య, కోర్టు మహిళా సిబ్బంది, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. ముందుగా రంగురంగుల పూలతో బతుమ్మలు పేర్చారు. తెలంగాణ సామూహిక జీవన విధానానికి ప్రజల ఐక్యతకు బతుకమ్మ పండగ ఒక నిదర్శనమని జిల్లా జడ్జి శ్రీవాణి అన్నారు. మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత కోర్టు ఆవరణలో బతుకమ్మలను ఉంచి పాటలు పాడుతూ.. ఆడారు. దీంతో కోర్టు ప్రాంగణమంతా పండగ
వాతావరణం నెలకొంది. – నిర్మల్‌టౌన్