
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
నిర్మల్‌చైన్‌గేట్: గ్రామపంచాయతీ సిబ్బందికి నా లుగు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించా లని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ ప్రధాన కా ర్యదర్శి బొమ్మెన సురేశ్ మాట్లాడుతూ దసరా పండుగ రోజున గ్రామ పంచాయతీ సిబ్బందిని పస్తులుంచకుండా వేతనాలు చెల్లించాలన్నారు. పంచా యతీ సిబ్బంది వేతనాలను గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని కోరా రు. మల్టీపర్పస్ వర్కర్ పని విధానం వలన ప్రమాదాలు జరిగి మరణిస్తున్న కార్మికులకు రూ.20 లక్షల పరిహారం చెల్లించాలన్నారు. జీవో51 సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 400 గ్రామ పంచాయతీ లు 1,470 మంది కార్మికులు, గ్రామ పంచాయితీ ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో శేఖర్, రవి, వెంకటేశ్, స్వామి, పోశెట్టి, నరసయ్య, నాగరాజు, రవి, లక్ష్మి, నర్సవ్వ పాల్గొన్నారు.