
సాహిత్యం ఓ మధురానుభూతి
నిర్మల్‌ఖిల్లా: సాహిత్యం ఓ మధురానుభూతి అని, ఈతరం చిన్నారుల్లో సాహిత్య అభిరుచిని పెంపొందించాలని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో కవి, రచయిత ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొండూరి పోతన్న రచించిన నరశతకంతోపాటు వెల్మల్ బొప్పారం ఉన్నత పాఠశాల విద్యార్థులు రాసిన కథల సంపుటి ‘‘అంకురాలు–2’’ పుస్తకాలను గురువారం స్వీకరించారు. రచయిత కొండూరి పోతన్న ఈతరం విద్యార్థుల్లో సాహిత్యంపై మక్కువ పెంచేలా చేస్తున్న కృషిని ప్రశంసించారు. కార్యక్రమంలో నర్సయ్య, రాములు, రాజన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.