
మద్యం టెండర్ల ప్రక్రియ షురూ
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్రంలో రెండేళ్ల కాల పరిమితి (2025–27)కి మద్యం దుకాణాల లైసెన్సుల ఎంపిక ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్రవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 23న లాటరీ నిర్వహించి దుకాణాలు కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు కేటాయించాల్సిన షాపుల ఎంపిక కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించారు.
47 మద్యం షాపులు..
జిల్లా వ్యాప్తంగా 47 మద్యం షాపులు ఉండగా వీటి లైసెన్సుల గడువు ఈ ఏడాది నవంబర్‌తో పూర్తవుతుంది. దీంతో కొత్తగా లైసెన్సులను జారీ చేసేందుకు ఎకై ్సజ్ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. దుకాణాల సంఖ్య, రిజర్వేషన్లు యథాతదంగా కొనసాగనున్నాయి. దరఖాస్తు రుసుం రూ.3 లక్షలుగా (నాన్ రిఫండబుల్), స్పెషల్ రీటెయిల్ ఎకై ్సజ్ ట్యాక్స్ (ఎస్‌ఆర్‌ఈటీ)ను రూ.5 లక్షలుగా నిర్ణయించారు. జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో దరఖాస్తులు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. ఒక వ్యక్తి రాష్ట్రంలోని ఎక్కడైనా, ఎన్ని షాపులకై నా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వుడ్ దుకాణాలకు ఆయా వర్గాల వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కలెక్టర్ల ఆధ్వర్యంలో డ్రా నిర్వహించి లైసెన్సులు జారీచేస్తారు.
జిల్లాలో రిజర్వు షాపులు ఇలా..
గెజిట్ నంబర్ మండలం/ ఏడాది రెంటల్ రిజర్వు
నిర్మల్ పరిధిలో.. వార్డు (రూ.లక్షల్లో) కేటగిరీ
006 నిర్మల్ 60 గౌడ్
020 సోన్ 50 ఎస్సీ
021 సారంగాపూర్ 50 ఎస్సీ
026 పెంబి 50 గౌడ్
027 కడెం. 50 ఎస్సీ
భైంసా పరిధిలో...
034. భైంసా మున్సిపాలిటీ 60 ఎస్సీ
038 కుభీర్ 55 గౌడ్
041 నర్సాపూర్(జి) 55 ఎస్టీ
047 తానూర్ 50 ఎస్సీ