
‘గడ్డెన్నవాగు’కు భారీగా వరద
భైంసాటౌన్: ఎగువన కురుస్తున్న వర్షాలకు భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు గురువారం భారీ ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. 3,300 ఇన్‌ఫ్లో రాగా, ప్రాజెక్టు అధికారులు రెండు గేట్లు ఎత్తి 11,400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా, ప్రస్తుతం 358.40 మీటర్ల నీటిమట్టం కొనసాగిస్తూ నీటిని విడుదల చేస్తున్నారు.
స్వర్ణ ప్రాజెక్టు గేటు ఎత్తివేత
సారంగపూర్: మండలంలో గురువారం తెల్లవారు జామునుంచి కురుస్తున్న జర్షాలకు స్వర్ణ ప్రాజెక్టులో కి వరద భారీగా వస్తోంది. అధికారులు ఒక గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,183 అడుగులు కాగా, ప్రస్తుతం 1,980 క్యూసెక్కుల వరద వస్తోంది. 1,985 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
‘కడెం’ గేటు ఎత్తివేత..
కడెం: కడెం ప్రాజెక్టుకు గురువారం 6,611 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ప్రాజెక్టు అధికారులు ఒక వరద గేటు ఎత్తి 4,099 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699.350 అడుగులు నిలకడగా ఉంచుతున్నారు.