
వైభవంగా బతుకమ్మ సంబరాలు
నిర్మల్ చైన్‌గేట్/నిర్మల్‌టౌన్/బాసర: కలెక్టరేట్ ఆవ రణలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో బుధవారం కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకూ హాజరయ్యారు. వివి ధ శాఖల అధికారులు, ఉద్యోగులతో కలిసి బతుక మ్మ ఆడారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు ఫైజా న్ అహ్మద్, కిశోర్‌కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీ రా సంకేత్‌కుమార్, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీ, నాయుడువాడలోని వాసవీ కన్యకా పరమేశ్వరి మందిరంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎస్పీ జానకీ షర్మిల పాల్గొన్నారు. కాలనీ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. వేడుకల్లో శివంగి టీం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కమ్యూనిటీ బతుకమ్మలో భాగంగా మహిళలు, యువతకు పోలీసులు సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలు, గాంజా గస్తీ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. నిర్మల్ ఏఎస్పీ రాజేశ్‌మీనా, పట్టణ, రూరల్ సీఐలు ప్రవీణ్‌కుమార్, కృష్ణ, ఎస్సైలు సంజీవ్, శ్రావణి, పోలీస్ అధికారులు, మహిళలు పాల్గొన్నారు.
ఆర్జీయూకేటీలో..
పోలీస్ అక్క నారిశక్తి ఆధ్వర్యంలో బాసర ఆర్జీయూకేటీ కళాశాల మైదానంలో విద్యార్థినులు, స్థానిక పోలీసుల బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ మహిళలు, విద్యార్థినులకు వీసీ గోవర్ధన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

వైభవంగా బతుకమ్మ సంబరాలు

వైభవంగా బతుకమ్మ సంబరాలు