వరద నివారణ చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

వరద నివారణ చర్యలు చేపట్టాలి

Sep 25 2025 7:05 AM | Updated on Sep 25 2025 7:05 AM

వరద నివారణ చర్యలు చేపట్టాలి

వరద నివారణ చర్యలు చేపట్టాలి

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ● అధికారులతో సమీక్ష

నిర్మల్‌చైన్‌గేట్‌: నిర్మల్‌ పట్టణానికి భవిష్యత్‌లో వరదలు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. బు ధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో లేక్‌ ప్రొటెక్షన్‌పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఇటీవల భారీ వర్షాలకు పలు కాలనీల్లో వరదనీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. సమస్య పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థను బలో పేతం చేయాలని సూచించారు. వరదల నియంత్రణలో సర్వే, రెవెన్యూ, మున్సిపల్‌, నీటిపారుదల శా ఖలు సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. పట్టణంలో వరదలు సంభవించడానికి గల ప్రధాన కారణాలు గుర్తించి, వాటి నివారణకు శాశ్వత పరిష్కారాలు చూపాలని ఆదేశించా రు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, కాలువలు, చెరువులు, నది, వాగుల ప్రవాహ మార్గాలపై ప్రత్యే క దృష్టి పెట్టాలని తెలిపారు. అవసరమైతే మాస్టర్‌ ప్లాన్‌ ఆధారంగా సవరణలు చేసి, శాశ్వత రీతిలో వరద నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించా రు. అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) కిశోర్‌కుమార్‌, ఏడీ సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఆర్‌.సుదర్శన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, తహసీల్దార్లు రాజు, సంతోష్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

బతుకమ్మ వీడియోలకు ప్రోత్సాహకాలు

జిల్లాలో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలను మరింత ఉత్సాహభరితంగా మార్చేందుకు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా మహిళలు, బతుకమ్మ గ్రూపులు తీసిన వీడియోలను కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌కు పంపితే అందులో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి ప్రోత్సాహకాలు అందజేస్తామ ని ప్రకటించారు. రెండు నిమిషాల నిడివి గల హై క్వాలిటీ వీడియోలను ఈ నెల 30లోపు పంపాలని సూచించారు. ఎంపికైన వీడియోలను జిల్లా అధికా రిక సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో పోస్టు చేస్తామని తెలిపారు. ఆసక్తిగల వారు తమ వీడియోలను వాట్సాప్‌ నంబర్‌ 91005 77132కు పంపాలని కో రారు. వీడియో పంపేటప్పుడు వ్యక్తి పేరు లేదా బ తుకమ్మ గ్రూప్‌, సంఘం పేరు, చిరునామా, మొబై ల్‌ నంబర్‌ తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement