
విత్తనోత్పత్తితో నాణ్యమైన దిగుబడి
కుంటాల: విత్తనోత్పత్తితో నాణ్యమైన దిగుబడి సాధించవచ్చని ముధోల్ ఏరువాక శాస్త్రవేత్త డాక్టర్ కార్తిక్ సూచించారు. నాణ్యమైన విత్తనం–రైతుకు నేస్తం కార్యక్రమంలో భాగంగా మండలంలోని పెంచికల్‌పాడ్ గ్రామ రైతు కదం మధుసూదన్‌కు ప్రభుత్వం డబ్ల్యూజీఎ ల్–1246 రకం వరి విత్తనాన్ని సరఫరా చేసింది. అతడు సాగు చేసిన వరి పొలాన్ని బుధవారం క్షేత్రస్థాయిలో ఆయన సందర్శించారు. రైతులకు సాగులో సలహాలు, సూచనలు చేశారు. ఏఈవో గణేశ్ తదితరులున్నారు.
ఫిర్యాదుదారులకు భరోసా ఇవ్వాలి
పెంబి: వివిధ సమస్యలపై పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు భరోసా ఇవ్వాలని ఏఎస్పీ రాజేశ్ మీనా సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ రికా ర్డులు పరిశీలించి కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట ఖానాపూర్ సీఐ అజ య్, ఎస్సై హన్మాండ్లు, సిబ్బంది ఉన్నారు.

ఫిర్యాదుదారులకు భరోసా ఇవ్వాలి