
పర్యావరణ అనుమతులు తప్పనిసరి
నిర్మల్‌చైన్‌గేట్: అభివృద్ధి పనులకు పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులకు ముందుగానే పర్యావరణ అనుమతులు తీసుకోవా లని సూచించారు. ప్రాజెక్టులు, రోడ్లు, గనులు, నీటిపారుదల పనులు, అటవీ అభివృద్ధి, పంచాయతీరాజ్, రోడ్లు–భవనాలు వంటి శాఖల్లో పనులకు అనుమతులు లభించిన వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని వివరించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే పనులు వేగవంతంగా పూర్తవుతాయన్నారు. సమావేశంలో ఆర్డీవో రత్నకళ్యాణి, సీపీవో జీవరత్నం, జిల్లా సర్వే రిపోర్ట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.