
ఖానాపూర్‌కు ధాన్యం ఆరబెట్టే యంత్రం
ఖానాపూర్: మండలంలోని రైతుల కోసం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి వరి ధాన్యం ఆరబెట్టే యంత్రం మంజూరైంది. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంటనే ఆరబెట్టేందుకు ఇది దోహదపడుతుందని సివిల్ సప్లయ్ డీఎం సుధాకర్, జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్, డీఎస్‌వో శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో యంత్రం ట్రయల్‌ను మంగళవారం పరిశీలించారు. యంత్రంలో తడిసిన ధాన్యాన్ని పోసి యంత్రం ఆరబెడుతున్న తీరును గమనించారు. రైతుల సౌకర్యార్థం జిల్లాకు ఒకే ఒక్క యంత్రం రాగా, దానిని ఖానాపూర్‌కు మంజూరు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీవో నర్సయ్య, మార్కెట్ కమిటీ కార్యదర్శి సయ్యద్ అజం అలీ, ఎంఎల్‌ఎస్ పాయింట్ డీటీ రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ కార్యదర్శి ఆశన్న పాల్గొన్నారు.