
కలెక్టరేట్‌లో బతుకమ్మ వేడుకలు
నిర్మల్‌చైన్‌గేట్: సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ బతుకమ్మలకు పూజలు చేసి వేడుకలను ప్రారంభించారు. ఉద్యోగులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు, ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. అంతకుముందు పలువురు మహిళా ఉద్యోగులు వేసిన రంగవల్లులను పరిశీలించారు. సామాజిక అంశాలపై అవగాహన పెంపొందేలా ముగ్గులు వేసిన ఉద్యోగులను అభినందించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.