
వేతనాల కోసం ప్రజావాణిలో వినతి
ఖానాపూర్: ఐటీడీఏ పరిధిలోని నాలుగో తరగతి ఉద్యోగులైన దినసరి కార్మికులు, పార్ట్ టైం, శానిటేషన్ కార్మికుల 7 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని గిరిజన సంక్షేమ శాఖ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కేబీసీ నారాయణ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులతో కలిసి హైదరాబాద్‌లోని ప్రజావాణితోపాటు ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్‌కు మంగళవారం వేర్వేరుగా వినతిపత్రాలను అందించారు. 7 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో పూట గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వినతిపత్రాలు ఇచ్చినవారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్య వాలుసింహా, నాయకులు షౌకత్ హుస్సే న్, శ్రీనివాస్, రాంచందర్, వసంత్, రాజలింగు, దిలీప్, సోనేరావు, విఠల్, రమేశ్ ఉన్నారు.