
యూరియా కొరత తీర్చండి
నిర్మల్‌చైన్‌గేట్: యూరియా కొరత తీర్చాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నందిరామయ్య కోరారు. యూరియా కొరత, పత్తి పంటకు కనీసం మద్దతు ధర అమలు, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కా ర్యాలయంలో ఏవోకు సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఏఐయూకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంది రామయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు కొనసాగిస్తున్నాయన్నారు. స్వామినాథన్ సిఫార్సుల ప్రకా రం పత్తికి ఖర్చుల ప్రతిపాదికన రూ.10,075 కనీస మద్దతు ధర నిర్ణయించాలన్నా రు. పోడు రైతులను ఫారెస్ట్ అధికారులు భయపెడుతున్నారన్నారు. ఆయన వెంట సీపీఐఎంఎల్ మాస్‌లైన్ పార్టీ నిర్మల్ జిల్లా కార్యదర్శి కె.రాజన్న, గోరెభాయ్, లక్ష్మీనారాయణవర్మ, గోనె లచ్చన్న పాల్గొన్నారు.