
పిడుగుపాటుతో మహిళ మృతి
సాత్నాల: భోరజ్ మండలంలోని పెండల్‌వాడ గ్రా మంలో ఆదివారం పిడుగు పడి నాగుల నిర్మల (33) అనే మహిళ మృత్యువాత పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం చేనుకు వెళ్లి పనులు ముగించుకుని సాయంత్రం తిరిగివస్తున్న సమయంలో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలికి భర్త సంతోష్ ఉన్నాడు.
బండరేవు తండాలో ఆవు..
సారంగపూర్: మండలంలోని పొట్య గ్రామపంచాయతీ పరిధిలోని బండరేవు తండాలో పిడుగు పడి ఒక ఆవు మృతి చెందింది. బాధిత రైతు ఆడె క్రిష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఎప్పటిలాగే పశువులను మేతకు సమీప అటవీ ప్రాంతానికి తరలించాడు. అయితే ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో పిడుగు పడి ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. మృతిచెందిన ఆవు విలువ సుమారు రూ.48వేల వరకు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు.
బూరుగుపల్లి (జి) తండాలో ఎద్దు..
నర్సాపూర్(జి): మండలంలోని బూరుగుపల్లి(జి) తండా గ్రామంలో పిడుగుపాటుకు ఎద్దు మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల మేరకు.. బూరుగుపల్లి (జి) తండా గ్రామానికి చెందిన జాదవ్ రవీందర్, జాదవ్ రాందాస్ అనే ఇద్దరు అన్నదమ్ములు పొలానికి వెళ్లి ఎడ్లబండిపై తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురై ఒక ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. ఎద్దు విలువ రూ.60వేలు ఉంటుందని వారు తెలి పారు. ఘటనలో రాందా స్ అనే వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ని లకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
గంగాపూర్ శివారులో గేదె..
రెబ్బెన: మండలంలోని గంగాపూర్ శివారులో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు అదే గ్రామానికి చెందిన యాదగిరి శ్రీశైలంకు చెందిన గేదె మృతువాత పడింది. బాధితుడి కథనం ప్రకారం రోజు మాదిరిగానే యాదగిరి శ్రీశైలంకు సంబంధించిన బర్ల మంద గ్రామ శివారులో ఉన్న సమ్మక్కసారలమ్మ గద్దెల సమీపంలో మేత కోసం వెళ్లగా సాయంత్రం ఒక్కసారిగా పిడుగుపడి గేదె మృతి చెందింది. మృతి చెందిన గేదె విలువ సుమారు రూ.30వేల వరకు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు.

పిడుగుపాటుతో మహిళ మృతి