
భార్యను హత్య చేసిన భర్త అరెస్టు
రెబ్బెన: కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా భర్త గొడ్డలితో నరికి చంపిన ఘటన మండలంలోని నారాయణపూర్‌లో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని సీఐ కార్యాలయంలో సీఐ సంజయ్ కేసు వివరాలు వెల్లడించారు. నారాయణపూర్‌కు చెందిన గజ్జల తిరుపతి టాటా ఏస్ వాహనం డ్రైవర్‌గా పని చేసేవాడు. అతనికి చిన్నబుదెకు చెందిన స్రవంతి(38)తో 21 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. గత కొంతకాలంగా మద్యానికి బానిసైన తిరుపతి తరుచూ భార్యతో గొడవపడేవాడు. అందులో భాగంగానే భార్యను ఎలాగైనా వదిలించుకో వాలని శనివారం తెల్లవారుజామున ఇంటి పనుల్లో నిమగ్నమైన స్రవంతిని గొడ్డలితో నరికి చంపి పరారయ్యాడు. మృతురాలి తమ్ముడు సంజయ్ అందించిన సమాచారం మేరకు ఏఎస్పీ చిత్తరంజన్, సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌టీం ద్వారా శాసీ్త్రయకోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. భార్యను నరికి చంపి పోలీసులకు దొరకకుండా పారిపోవడానికి శనివారం రాత్రి రెబ్బెన రైల్వేస్టేషన్‌కు రాగా తిరుపతిని పట్టుకుని విచారించినట్లు సీఐ తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే భార్యను నరికి చంపినట్లు అంగీకరించాడని, ఆదివారం జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఎస్సై వెంకట్‌కృష్ణ, సిబ్బంది సందీప్, దుర్గేందర్, ఎస్. శ్రీనివాస్, మహేశ్‌లు ఉన్నారు.