
మృతదేహాన్ని చేతులపై మోసుకుంటూ..
కెరమెరి: వర్షాలకు వాగులు ఉప్పొంగి జిల్లా ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. మృతదేహాన్ని అతికష్టం మీద వాగు దాటించిన ఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని కరంజీవాడలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న మండాడి కోసు(60) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారకస్థితికి చేరడంతో కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. ఆరోగ్యం విషమించి ఆదివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో మృతదేహంతో స్వగ్రామానికి బయల్దేరారు. మార్గమధ్యలోని అనార్‌పల్లి వాగు ఉప్పొంగడంతో అంబులెన్స్ వాగు దాటే అవకాశం లేకపోవడంతో మానవహక్కుల సంఘం జిల్లా చైర్మన్ రమేశ్, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చేతులతో పట్టుకుని వాగుదాటారు. మృతుడికి భార్య రాజుబాయి, కుమారులు మారు, జంగు ఉన్నారు.