
రహదారులు, వంతెనల నిర్మాణానికి కృషి
ఖానాపూర్: మారుమూల గ్రామాల్లో అంతర్గత రహదారులు, వంతెనల నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయానికి ఆదివారం పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పెంబి మండలం పోచంపల్లి నుంచి రాయదారి వరకు రహదారితోపాటు వంతెన నిర్మాణం చేపట్టాలని పోచంపల్లి గ్రామస్తులు విన్నవించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖానాపూర్, కడెం, పెంబి, దస్తూరాబాద్ మండలాల ప్రజలకు ప్రతీ శుక్ర, శని, ఆదివారాల్లో అందుబాటులో ఉంటానని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు దయానంద్, చిన్నం సత్యం, నిమ్మల రమేశ్, తోట సత్యం, మదిరె సత్యనారాయణ, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.