
మైనర్లకు వాహనాలిస్తే యజమానులపై కేసు
● ఏఎస్పీ రాజేశ్‌మీనా
నిర్మల్ టౌన్: వాహనదారులు అన్ని ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని.. మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసు నమోదు చేస్తామని నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా సూచించారు. ఎస్పీ జానకీషర్మిల ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో మైనర్ డ్రైవింగ్‌పై ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పట్టుబడ్డ మైనర్ల తల్లిదండ్రులను పిలిపించి పట్టణ పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. మైనర్ డ్రైవింగ్‌తో కలిగే ప్రమాదాలు ప్రాణ నష్టం కుటుంబాలపై పడే భారం, చట్టపరమైన పరిణామాల గురించి వివరించారు. తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు.