
విద్యుత్ ఫీడర్ లైన్‌పై పిడుగు
లోకేశ్వరం: మండల కేంద్రంలోని భగీరథ చెరువు నీటిలో ఉన్న విద్యుత్ స్తంభం 33/11 కేవీ ఫీడర్ లైన్‌పై శనివారం రాత్రి పిడుగు పడింది. దీంతో లోకేశ్వరం సబ్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరా నిచిలిపోయింది. గుర్తించిన విద్యుత్ ఏఈ శివకుమార్ మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. భగీరథ చెరువులోకి వెళ్లి మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. ఆదివారం ఏఎల్‌ఎంలు గంగాధర్, శ్రీకాంత్, ఎల్‌ఎం గజానంద్‌రెడ్డి చెరువులోకి ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేపట్టారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ముగ్గురు సిబ్బందిని లోకేశ్వరం విద్యుత్ సబ్ స్టేషన్‌లో అభినందించారు. వారి వెంట సురేశ్, శ్రీకాంత్, రవీందర్, సతీశ్, సవీన్, నజీర్ ఉన్నారు.

విద్యుత్ ఫీడర్ లైన్‌పై పిడుగు

విద్యుత్ ఫీడర్ లైన్‌పై పిడుగు