
లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిద్దాం
నిర్మల్‌టౌన్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చివరి శ్వాస వరకు పోరాటం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు చిలుక రమణ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిలుక రమణ మాట్లాడుతూ.. పద్మశాలి కుల సంక్షేమం, అభివృద్ధి కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి చేశారన్నారు. ప్రభుత్వం పద్మశాలి కులానికి అన్నిరంగాల్లో ప్రాధాన్యం కల్పించాలని కోరారు. మార్కండేయ ఆలయాలు ప్రతీ గ్రామంలో నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలన్నారు. పద్మశాలి యువతను ఆదుకునేందుకు స్వయం ఉపాధి పథకాల కోసం ప్రత్యేక ఆర్థిక కార్యాచరణ అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నేతలు ఆడెపు సుధాకర్, జల్డ రాజేశ్వర్, మిట్టపల్లి నర్సయ్య, జల్డ గంగాధర్, గంగ సురేశ్, దత్తాద్రి, కిషన్, రాజేశ్వర్, బిట్లింగు నవీన్, పెండెం శీను, చిట్టన్న, భానుచందర్, నరహరి, మనోహర్, పండరి పాల్గొన్నారు.