
కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
కడెం: కడెం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఆదివారం 8,094 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో అధికారులు రెండు వరద గేట్లు ఎత్తి 8,234 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699.500 అడుగులు ఉంది.
స్వర్ణ ప్రాజెక్టు గేటు ఎత్తివేత..
సారంగపూర్: మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి స్వర్ణ ప్రాజెక్టులోకి పెద్ద మొత్తంలో వరదనీరు చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి దిగువకు వరదనీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,183 అడుగులు కాగా, ప్రాజెక్టులోకి 1,980 క్యూసెక్కుల వరద వస్తుండడంతో ఒక గేటు ఎత్తి 1,985 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 1182.9 అడుగుల వద్ద స్థిరంగా ఉంది.

కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో